గొట్లాం యువకులకు వాలీబాల్ కిట్టు అందించిన జనసేన నాయకులు

మాడుగుల నియోజకవర్గం, కె కోటపాడు మండలం జనసేన నాయకులు కుంచా అంజిబాబు ఆర్థిక సహాయంతో గొట్లాం గ్రామపంచాయతీలో గల యువకులకు వాలీబాల్ కిట్టు మజ్జి ఈశ్వర రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా అంజిబాబు మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా శరీరానికి వ్యాయామంతో పాటు, ఆరోగ్యం, చురుకుదనం వస్తాయి అని క్రీడలను జనసేన ఎప్పుడూ ప్రోత్సాహిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి గోవిందరావుగోల్డ్, రాజు, హరీష్, రాము పైడ్రాజు, గంగునాయుడు గబ్బర్సింగ్ గణేషు, శ్రీను, సూర్య మరియు గొట్ల గ్రామ జనసైనికులు, కోటపాడు మండలం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.