తాల్లూరి రామావతిని పరామర్శించి ఆర్ధికసాయమందించిన జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన తాల్లూరి వెంకటేశ్వరరావు అకాల మరణం కారణంగా వారి భార్య తాల్లూరి రామావతిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ లు పరామర్శించి వరి చేతుల మీదుగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆర్థిక సహాయంతో రామావతికి రూపాయలు 5,000/-₹ నగదు ఆర్ధికసాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, సీతానగరం మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేత సత్యనారాయణ, చిడిపి నాగేష్, దుబాయ్ శ్రీను, అప్పయమ్మ (ప్రసాద్) సీతానగరం మండల కమిటీ మెంబెర్ రాజు, గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.