దివాన్ చెరువు గ్రామంలో జనంకోసం జనసేన మహా పాదయాత్ర

రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ ఇస్తూ ఈసారి “గాజు గ్లాసు” గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ పాదయాత్రలో వీరితో పాటు జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.