జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో శుక్రవారం కొత్తూరు మసీదు, ఇస్మాయిల్ వీధి నుండి జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు మాట్లాడుతూ.. సమాజం అంటే రకరకాల కులాలు, మతాలు, వ్యక్తుల సమ్మేళనం అనీ అన్నింటినీ జాగరూకతతో కాపాడుకుంటూ వ్యవహరించాలన్నారు. దురదృష్టవశాత్తు నేటి వై.సి.పి ప్రభుత్వం మైనారిటీల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందనీ, ఇది ముస్లిం వర్గాలని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. అసలే అరకొరగా ఉన్న ఉర్దూ పాఠశాలలని విధ్యర్ధుల సంఖ్య తగినంత లేదంటూ నగరంలోని కొన్ని మునిసిపల్ ఉర్దూ పాఠశాలలని వీరే స్కూళ్ళలో విలీనం చేయడంపైన ముస్లింలు తీవ్రంగా బాధపడుతున్నారన్నారు. దీనినిబట్టి ఈ ముఖ్యమంత్రికి ముస్లిం ప్రజలపైన ఉన్న చిన్నచూపు అర్ధమవుతోందనీ, దీనిని తామందరం కలసికట్టుగా ఖండించి రాబోయే ఎన్నికలలో వై.సి.పి ప్రభుత్వాన్ని ఓడించి తగిన తమ ఉనికిని చాటి చెప్పే తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, ఎస్.కె. షాజహాన్, ఎం.డి. జాఫర్, ఎస్.కె. సంధానీ, షరీఫ్, తాజుద్దీన్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.