రాజానగరంలో వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ.. వరుస చేరికలతో ఫుల్ జోష్ మీద ఉన్న జనసేన..

రాజానగరం: ప్రజానాయకులు, సేవాతత్పరుడు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అయిన దగ్గర్నుంచి. ఆయన చేస్తున్న పలు సేవాకార్యక్రమాలు, కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ ఆదుకుంటున్న తీరుకు.. ఇతర పార్టీలకు చెందిన పలువురు నియోజకవర్గంలో నిర్విరామంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతూనే ఉన్నారు.. వరుస చేరికలతో మంచి జోష్ మీద ఉన్న జనసేన పార్టీలో శనివారం కూడా వైఎస్ఆర్సిపి కి చెందిన పలువురు చేరారు.. సీతానగరం మండలం, చిన్న కొండేపూడి గ్రామవాసి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు.. ఆ గ్రామ మాజీ సర్పంచ్ పాకా రామకృష్ణ వారి అనుచరగణం (అధిక సంఖ్యలో మహిళలు, పెద్దలు) మొత్తం 40 మంది కార్యకర్తలు… వైఎస్సార్సీపీ దుర్మార్గపు పాలనకు విసుగుచెంది.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన రాజకీయ ప్రయాణం నచ్చి, బత్తుల బలరామకృష్ణ సమర్థమైన నాయకత్వం పట్ల ఆకర్షితులై.. జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది…. వారికి జనసేన కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వరస చేరికలతో క్యాడర్లో నూతన ఉత్సాహం నిండి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించడానికి పరిపూర్ణంగా జనశ్రేణులు సిద్ధమవుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మట్ట వెంకన్న, మద్దాల యేసుపాదం, చీకట్ల వీర్రాజు, నాగవరపు సత్తిబాబు, ప్రశాంత్ చౌదరి, కొండేపూడి బ్రహ్మం ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.