మడవనేరి గ్రామంలో జనసేన పల్లెబాట

పూతలపట్టు: తవణంపల్లి మండలం, మడవనేరి గ్రామంలో జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పల్లెబాట కార్యక్రమం మండల అధ్యక్షులు రాజశేఖర్ (శివ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేసి, జనసేన మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. దాదాపు 70 కుటుంబాలతో కలసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపి, ఉదయ్, మని, ధన, శేఖర్, దినకర్, వివేక్, శేఖర్ పాల్గొనడం జరిగింది.