బాధితునికి న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని, నందనూరు పంచాయతీ, పెద్దకంటిపల్లి గ్రామానికి చెందిన దళితుడైన చంద్రన్ ను, అదే పంచాయతీ పరిధిలోని కలిజవేడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి (28-02-2022) న తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని తన మామిడి తోటలో అతని కుటుంబ సభ్యులను, మహిళలను అత్యంత దారుణంగా తిడుతూ.. నానా విధాలుగా దుర్భాషలాడుతూ.. కులం పేరుతో దూషిస్తూ.. విచక్షణ రహితంగా కొట్టి అతని కాలు, చేయి విరిచేయడం జరిగింది. బాదితుణ్ణి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డాక్టర్ యుగంధర్, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, గంగాధర నెల్లూరు మండలం అధ్యక్షులు వినోద్, సంయుక్త కార్యదర్శి వినోద్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామని దైర్యం చెప్పారు.