నిరుపేద కూలి కుటుంబానికి జనసేన పార్టీ చేయూత

మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని, చినకరగ్రహారాని చెందిన మెరుగు నాగబాబు ఇటీవల అనారోగ్యంపాలై కూలిపనులకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. ఆ నిరుపేద కుటుంబానికి (ఎన్.ఆర్.ఐ) చలమలశెట్టి బాలాజీ 10 వేలరూపాయలు మరియు జనసేన పార్టీ మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ ఆ కూలిన కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు 10 వేల రూపాయలు కలిపి మొత్తం 20 వేల రూపాయల నగదును ఆ పేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ.. చాలా నిరుపేద కుటుంబం అని.. దయనీయ స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయంఅందించి ఆదుకోవాలని, అలాగే స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని మెరుగు నాగబాబు కుటుంబానికి అందజేయాలని తెలిపారు. జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు, విన్నకోట శ్రీకాంత్, బొద్దుల పవన్, ముత్తిరెడ్డి పృథ్వి తదితరులు పాల్గొన్నారు.