జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్

దుర్మార్గులు ఏవిధంగా ఉంటారో వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తుంటే తెలుస్తుంది. నష్టపరిహారం ఎంత జరిగిందని ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు. వరదల్లో ఇబ్బందులు పడుతున్న వారికి కనీసం ఆహారం ప్రభుత్వం అందించడం లేదు. ప్రజల కోసం పని చేయలేని ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలి. ప్రాణ నష్టం పంట నష్టం మూగ జీవాలు నష్ట పోయిన వారిని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. పంట నష్ట పరిహారంలో రాజకీయాలు మాట్లాడకుండా రైతులకు న్యాయం చేయాలి. అధికారులు పంట నష్టం ఏవిధంగా వాటిల్లిoదో ఇంతవరకు లెక్కలు లేవు. ప్రభుత్వం పంట నష్ట పోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెక్రటరీ శ్రీ నయబ్ కమల్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.