జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం

నాగర్ కర్నూల్ జిల్లా, జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ ముఖ్య అతిధిగా జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.