ముస్లింల అభివృద్ధికై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

  • వెనకబడిన తరగతులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పూర్తి అవగాహన
  • ముస్లింలపై వైసీపీది కపట ప్రేమ
  • కులమతాలకతీతంగా పేదరికాన్ని పారద్రోలటమే జనసేన లక్ష్యం
  • గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ళ సురేష్
  • జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, కొన్ని దశాబ్దాలుగా ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముస్లింల సమగ్రాభివృద్ధికై, వారి సంక్షేమానికై ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్లాం విద్యా, ధార్మిక సంస్థలకు 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన సందర్భంగా 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలోని పీర్లచావిడి సెంటర్లో గురువారం ముస్లింలు అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పర్వదినాలలో పవన్ కళ్యాణ్ మదర్శాలకు, దర్గాలకు పెద్దఎత్తున విరాళం ప్రకటించటం ఎంతో ముదావహం అన్నారు. అధికారంలోకి రావటానికి ముస్లిం మైనారిటీలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వైసీపీ మోసం చేసిందని విమర్శించారు. ముస్లింల అభివృద్ధికై ముస్లిం పెద్దలు దానం చేసిన వక్ఫ్ భూములను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కోట్లాది రూపాయల భూములను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి రాగానే వాటిని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. వీటితో పాటూ వారికి విద్యా, వైద్యం ఉచితంగా ఇవ్వాలన్న సదాశయంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పేద ముస్లిం అడబిడ్డల పెళ్లికి ఇస్తానన్న షాదీ తోఫా కానీ ముస్లిం యువత ఉపాధికై ఇస్లామ్ బ్యాంక్ స్థాపిస్తాను అన్న హామీని కానీ వైసీపీ నెరవేర్చలేదని విమర్శించారు. ముస్లిం మైనారిటీలపై వైసీపీది కపట ప్రేమ అని దుయ్యబట్టారు. జనసేన అధికారంలోకి రాగానే కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న పేద, సామాన్య ప్రజల అభ్యున్నతికై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెడతారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న దుష్ప్రరిపాలన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు జనసేనకు అండగా నిలవాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో నాయకులు యడ్ల నాగమల్లేశ్వరరావు, బండారు రవీంద్ర, రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు, కోనేటి ప్రసాద్, యూసుఫ్, కరీముల్లా, అఙ్గర్ బాషా, యాసిఫ్ బాషా, ఆసిమ్, సోమి ఉదయ్, నాగేంద్ర సింగ్, గట్టు శ్రీకాంత్, నండూరి స్వామి, అంజి, శెట్టి శ్రీను, చిరంజీవి, శేషు, పెద్ద శ్రీను, హరి, పులిగడ్డ గోపి, సుంకర హరి తదితరులు పాల్గొన్నారు.