విద్యుత్ మీటర్ల ఏర్పాటు వద్దు, పాత పద్ధతి ముద్దు

*వ్యవసాయ బోరు వద్ద జనసేన పార్టీ నిరసన
*ప్రభుత్వం తీరుపై మండిపడ్డ రామదాస్ చౌదరి

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రైతులను ఉచిత విద్యుత్ ఇస్తే.. తండ్రి ఆశయాన్ని తుంగలో తోక్కి వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ఉసురు తగిలి మట్టి కొట్టుకు పోతాడని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి శాపనార్దలు పెట్టారు. ‌శనివారం మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి‌ సమీపంలోని వ్యవసాయ బోరు వద్ద విద్యుత్ మీటర్ల ఏర్పాటు పై జనసేన పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ‌ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, రోనూరి బాబు, శక్తి, లోకేష్, రెడ్డెమ్మ హాజరైనారు. ఈ సందర్భంగా రైతుల దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, వ్వవసాయ బోర్లకు మీటర్ల వద్దు, పాత పద్ధతే ముద్దు, వ్వవసాయ బోర్లుకు మీటర్ల బిగించి రైతును ఇబ్బంది పెట్టవద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ.. వినాశకాలే విపరీత బుద్ది అనే విధంగా.. అన్ని వర్గాల ప్రజలను జగన్మోహన్ రెడ్డి వంచించి మోసం చేశాడని విమర్శించారు. వైసిపి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయం చేసే రైతులకు కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, అప్పుల బాధలు మిగిలాయి తప్ప ఆర్థికంగా ఎదిగింది‌ ఏమి లేదని విమర్శించారు. తండ్రి ఆశయాన్ని తుంగలో తోక్కి రైతుల వ్వవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు చేయడం దారుణం అన్నారు. పక్క రాష్ట్ర సిఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగించమంటే తిరస్కరించారని, జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని డిమాండ్‌ చేశారు. రూ.1800 కోట్లు ఖర్చు పెట్టి మీటర్ల ఏర్పాటు సబబు కాదని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకం వుండదనే ఇంకిత జ్ఞానం కూడా లేదని ఎద్దేవా చేశారు. ‌రైతుల ఉసురు తగిలి మట్టి కొట్టుకు పోతాడని శాపనార్దలు పెట్టారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ‌ప్రతి పని రివర్స్ చేయడం మామూలైందన్నారు. పుంగనూరులో రామచంద్ర యాదవ్ తలపెట్టిన ఉద్యోగ మేళాను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు, మంచి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వాలి తప్ప అడ్డుకోవడం తగదు అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ.. రైతు అమాయకుడు అని కరోనా వచ్చినా.. ఏమి వచ్చినా.. వ్యవసాయం చేయడమే వచ్చు అన్నారు. మీటర్ల బిగిస్తే పాత పద్ధతిలోనే రూ.30 మాత్రమే నెలవారీ వసూలు చేస్తారా అనే గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. మీటర్ల బిగించి హెచ్.పి పెరుగుదల, విద్యుత్ అధిక వాడకం, మీటర్ల స్పీడు అంటూ చార్జీలు బాదితే రైతుల పరిస్థితి ఏమిటని.. దీనికి ప్రభుత్వం భాద్యత వహిస్తుందా అని నిలదీశారు. రైతు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా క్రాప్ హాలీడే ప్రకటించడం వైసిపి ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ‌