చిర్రావూరులో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

మంగళగిరి నియోజవర్గం తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో చిర్రావూరు గ్రామంలో 25 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షాన పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మరియు రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, రాష్ట్ర ఐటి విభాగం సభ్యులు చ్వ్వాకుల కోటేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడ్డే కోమలి, తాడేపల్లి అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ( ఎస్.ఎన్.ఆర్ ), మంగళగిరి మండలం అధ్యక్షుడు వాస శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు , మంగళగిరి పట్టణ నాయకులు మునగాల మారుతి, పార్టీ నాయకులు తోట శ్రీనివాసరావు, చిర్రావూరు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.