జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది: చిర్రి బాలరాజు

  • వేలేరుపాడు మండలంలో చిర్రి బాలరాజు పర్యటన
  • వేలేరుపాడు జనసేన కార్యకర్తల సమావేశం

పోలవరం: వేలేరుపాడు మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పోలవరం నియోజకర్గ జనసేన పార్టీ ఇంఛార్జి చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేసంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ సభ్యత్వం నమోదుపై అవగాహన కల్పించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ ఖర్చులకు యాబై వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని అన్నారు. వేలేరుపాడు మండలంలో ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శులు క్రాంతికుమార్, మెచినెని సంజయ్, సుధాకర్, పోట్ల మోహన్, కృష్ణ, శంకర్, వంశీ, భాను, పవన్, మండల జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.