దుర్గాడ మిర్చి రైతులకు అండగా జనసేన పార్టీ

*వైరస్ తెగుళ్ళు కారణంగా మిర్చి పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
*జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గ ఎం.డి.ఓ. కి అగ్రికల్చర్ అధికారి కి వినతిపత్రం అందజేశారు: పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామాల్లో వైరస్ తెగుళ్ళుకు దెబ్బతిన్న పచ్చి మిర్చి, ఉల్లి మరియు కొబ్బరి తదితర పంటలను పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పలువురు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ… రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, పంట చేతికందే సమయంలో వైరస్ తెగుళ్లు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సుమారు 800 ఎకరాలలో మిర్చి తోటలో రసం పీల్చే పురుగుల(పేనుబంక) వలన పై ముడత మరియు మొత్తం పూత పిందు మొత్తం రాలిపోతున్నాయి. దీనితో రైతులకు 1ఎకరానికి 1లక్ష వరకు పెట్టుబడి నష్టం వచ్చింది రైతులకు 2లక్షలు నుండి 3 లక్షలు వరకు ఆదాయం పోయింది కాబట్టి దీన్ని విపత్తు గా భావించి నష్ట పరిహారం రైతులకు ఇవ్వాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.
పచ్చిమిర్చి పంటలు నష్టపోయిన రైతులకు పంట ఖర్చుల అంచనా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలాగే పంటల భీమా పథకం కింద వెంటనే రైతులకు కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం పై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. పంట నష్టం అంచనాలను వెంటనే తయారుచేసి రైతుల నష్టపరిహార జాబితాలను ఉన్న తాధికారులకు పంపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేర్చాలని వారు కోరారు. నెల రోజుల నుంచి మిర్చి రైతులు పంట నష్టానికి గురయ్యారు పంట చేతికి వచ్చే సమయానికి పంటకి వైరస్ తెల్ల నల్ల పేను పురుగులు బట్టి పంట నష్టం కలిగించిందని దీనికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగిన న్యాయం చేయాలని రైతులంటే దేశానికే వెన్నుముక అటువంటి రైతులను ఆదుకోవాలని రైతులు కష్టాలు పట్టించుకోండి ఈ రైతులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలియజేసారు. మండల ఎండివో కు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్పందనలో కూడా జనసేన పార్టీ తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రెండు మూడు రోజుల్లో గౌరవనీయులైన కలెక్టర్ కి వినతి పత్రం అందజేసే పిఠాపురం నుంచి కాకినాడ కలెక్టర్ కార్యాలయంకు రైతులతో కలిసి జనసైనికులు నాయకులు వీర మహిళలు తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా పాదయాత్ర చేపట్టి కలెక్టర్ వారికి దుర్గాడ మిర్చి రైతుల ఇబ్బందులు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, జిల్లా ఇన్చార్జిలు, జిల్లా కార్యవర్గం సభ్యులు, జనసైనికులు, నాయకులు, వీరమహిళలు పాల్గొంటారని మీడియాకు తెలియజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ,జిల్లా కార్యదర్శిలు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ,జనసేన వీర మహిళ తోలేటి శిరీష, జనసేన నాయకులు ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, కొప్పుల రమేష్, పెనుకొండ వెంకటేశ్వరరావు, కీర్తి చంటి, పుణ్యవంతులు మూర్తి, సూర్నీడి శ్రీను, వీరమహిళలు కేతినిడి గౌరీ నాగలక్ష్మి, వినుకొండ అమ్మాజీ, సి.హెచ్ శిరీష, దొడ్డి దుర్గ ప్రసాద్, కర్రీ హరిబాబు,యండ్రపు శ్రీనివాస్, మేళం బాబీ, చెప్పుల నాని,జోతుల గణేష్, వెలుగుల లక్ష్మణ్, శాఖ సురేష్, నాగల పేరయ్య, గుర్ర బుచ్చిరాజు, అడపా వెంకన్న, ఎన్.సత్తయ్య, మురళిశెట్టి రాజు, ఆకుల వీరబాబు, ఇంటి సత్యనారాయణ, శాఖ వేగిలయ్య, జనసైనికులు, నాయకులు, వీరమహిళలు మరియు దుర్గాడ రైతన్నలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.