రాములమ్మకి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది

జనవాణి జనసేన బరోసా రెండవ విడత కార్యక్రమం విజయవాడలో జరిగిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం తారక రామారామానగర్ గ్రామానికి చెందిన 87 సంవత్సరాల రాములమ్మ నివసిస్తున్న ఇంటిని వైసిపి నాయకులు కబ్జా చేసి ఇంటి నుండి బయటకు తరిమేశారని, ఆర్.డి.ఓ, ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం జరగలేదని పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్ ఆ గ్రామానికి వెళ్లి జరిగిన విషయాలను తెలుసుకోవడం జరిగింది. 2004 లో ఇంటి స్థలం అప్పుడున్న ప్రభుత్వం ఇస్తే , 2010 లో రాజీవ్ గృహ నిర్మాణ పథకం క్రింద లోన్ స్వీకరించి కడగాలు, ఇంటి నిర్మాణం చేసుకున్నారు, కరెంట్ మీటర్ కూడా ప్రభుత్వం నుండి తీసుకున్నారు. బలవంతంగా బుధవారం నాడు 20-30 మంది వచ్చి ఆమెని బయటకి గెంటేసి, ఇంట్లో ఉన్న వస్తువులను రోడ్డుపై విసిరేయడం జరిగింది. బలవంతంగా పోలీస్ స్టేషన్ లో వాళ్ళని రాత్రి వరకు ఉంచి కబ్జా చేసిన వాళ్ళకి పోలీసులు సహకరించి కొత్తగా ఇంటి నిర్మాణం చేశారని తెలిపారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటే ఇది ఒక్కరికీ జరిగిన అన్యాయం కాదు ఇలాంటివి దాదాపు 2 వేల మందికి ఈ వైసిపి ప్రభుత్వం వచ్చాక గతంలో ఇచ్చిన పట్టాలను దొడ్డి దారిన వైసిపి కార్యకర్తలకు కట్టబెట్టి వైసిపి కార్యాలయంలోనే దొంగ పట్టాలు ఇస్తూ, 20 వేలు రూపాయలు తీసుకుని కరెంట్ కనెక్షన్లు ఇచ్చి, తద్వారా ఇంటి పన్ను రసీదులు ఇప్పిస్తూ, కబ్జాలకు పాల్పడుతున్నారు అని స్థానికులు తెలియజేశారు. అన్యాయం జరిగినట్లైతే విచారించి న్యాయం చేస్తామని చెప్పాల్సిన అధికారులు, స్థానిక ఎమ్మెల్యే జనవాణి కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం వాళ్ళ కుసంస్కారనికి నిదర్శనం. ఇదే తరహాలో నియోజకవర్గంలో శ్రీకాళహస్తి పట్టణంలో కూడా రాజీవ్ నగర్ కాలనీ లో కూడా వేలాది ఇంటి స్థలాలు ఎమ్మెల్యే కబ్జాలు చేసి 20 వేల రూపాయలు తీసుకుని ఇంటి కరెంట్ కనెక్షన్, ఇంటి పన్ను రసీదులు ఇస్తూ కోటాను కోట్లు పేదల ఇంటి స్థలాలు కబ్జా ద్వారా లబ్ధి పొందుతున్నారు. నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు సవిరంగా రిపోర్ట్ తయారు చేసి పవన్ కళ్యాణ్ కి సమర్పిస్తామని, రాములమ్మకి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే దిగజారుడు మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం తగదని, ఎమ్మెల్యేకి దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి రావాలని ఇలాంటి కబ్జాలు, దోపిడీల గురించి ఆధారాలతో జనసేన నిరూపిస్తుందని వినుత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య నాయకులు ముని కుమార్, మనోజ్ కుమార్, రవి కుమార్ రెడ్డి, జగదీశ్, నితీష్ కుమార్, ఆనంద్, చందు చౌదరి, వెంకటరమణ, గిరీష్, ప్రశాంత్ జనసైనికులు పాల్గొన్నారు.