జనసేన పార్టీ మండల స్థాయి సమావేశం

శృంగవరపుకోట నియోజవర్గం, శృంగవరపుకోట, ఎల్. కోట మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఎస్. కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 మండలాల నాయకులు పాల్గోన్నారు. కార్యక్రమంలో భాగంగా కిట్లు పంపిణీ గురించీ మరియు పవనన్న పల్లెబాట అనే కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకొని వెళ్ళే విధంగా కార్యాచరణను రూపొందించారు. జూలై 1 వ తేదీ నుంచి ఈ కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఎస్. కోట నియోజకవర్గంలో ఐదు మండలాల నాయకులు, జనసైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.