మానవతా మూర్తి మదర్ థెరిస్సాకు జనసేన ఘన నివాళి

రంపచోడవరం నియోజవర్గం: మానవత్వానికి నిలువెత్తురూపం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదర్ థెరీసా వర్ధంతి సందర్భంగా మంగళవారం అడ్డతీగల కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మదర్ థెరీసా విగ్రహానికి ముందుగా పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, ఆమె సేవలు మరవలేని ఆవిడ సేవాగుణం ప్రతి ఒక్కరిలోని ఉండాలని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. అనంతరం అడ్డతీగల మండలం జనసేన ఆధ్వర్యంలో 100 మందికి పులిహార పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సురేష్, శివ, జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, ప్రసాదు, బాబి, అప్పాజీ, కాంగ్రెస్ పార్టీ దంగేటి సత్తిబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.