ప్రజా సమస్యలపై జనసేన వినతి పత్రం

  • అకాల వర్షాల కారణంగా నష్టపోయిన అన్నదాతను ఆదుకోండి..
  • కందమూరు ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్లో గత ఆరు నెలలుగా టీచర్లు లేక పేద విద్యార్థుల చదువు, నాడునేడు పనులు ఆగాయి… తగుచర్యలు తీసుకోండి..

నెల్లూరు: డ్రైనేజ్ కాలువల నిర్మాణంలో బుచ్చి ఖాదర్ నగర్ లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నేలకొరిగిన ఇంటి బాధితులకు పరిహారాన్ని ఇప్పించండి అంటూ జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సోమవారం కలెక్టర్ గారిని కలిసి అభ్యర్దించారు. ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో దాదాపు 4 వేల హెక్టార్ల పంట నష్టపోయిందని, తొలి కాపు చేతి కొస్తుంది. ఉగాది పండుగలో వెలివిరియాల్సిన గ్రామాలు వెలవెలబోతున్నాయి రైతులు దిగాలు పడుతున్నారు. పంట నష్టాన్ని త్వరిత గతిన అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలి. కోతల సమయం కావడంతో రోడ్లపై పోసిన ధాన్యరాశులు తడిసి ఇబ్బంది పడుతున్నారు వారి ఇబ్బందులను గమనించాలి.నత్త నడక నడుస్తున్న స్టోరేజీ గిడ్డంగులను త్వరితగతిన పూర్తి చేయాలి. కోతల సమయంలో తగ్గే దాన్యం రేటు దళారుల చేతులు మారగానే రేట్లు డబల్ అవుతున్నాయి. మన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న సర్వేపల్లి గ్రామంలోని ఎక్కువ శాతం నష్టం వాటిల్లింది. గత సంవత్సరాలలో పంట గిట్టుబాటు ధర కల్పించ లేనప్పుడు ఏమి చేయలేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గారు కనీసం ఎప్పుడైనా రైతులను ఆదుకోవాలి. నిన్ననే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డల చదువు నేను చూసుకుంటానని చెప్పారు. కందమూరు ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ లో చూసినట్లయితే 36 మంది పేద దళిత విద్యార్థులు చదువుతున్న స్కూల్లో గత సంవత్సరం రోజుల నుంచి టీచర్లు లేరు పేదల విద్యను మెగ్గల్లోనే తుంచేస్తుంది ఈ వైసిపి ప్రభుత్వం. టీచర్లు లేక నాడు నేడు పనులు కూడా ఆగిపోయినవి సత్వరమే స్పందించి టీచర్లను ఏర్పాటు చేయవలసింది. కోవూరు నియోజకవర్గం బుచ్చి ఖాదర్ నగర్ లో డ్రైనేజ్ కాలువ నిర్మాణంలో నిర్లక్ష్యం వల్ల కూలిపోయిన ఇల్లు తాలూకు నష్టపరిహారాన్ని ఇప్పించమని అందర్నీ వేడుకున్న ఫలితం దక్కలేదు కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే వారిని తక్షణమే ఆదుకోవాలి. నిన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసినట్లయితే ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నారనేది తెలుస్తుంది. గుడ్డి కంటే మెల్ల మేలు అనే చందాన కాకుండా ఈసారి ప్రజల పక్షాన నిలబడే ప్రజా ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వాన్ని గెలిపించవలసింది. అధికారంలో లేకుండానే ఎంతోమంది కౌలు రైతులను ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారు రైతుల సుభిక్షంగా జీవించేందుకు అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేయగలరు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా మనవి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో హేమచంద్ర యాదవ్, శరవణ, మౌనిష్, ప్రశాంత్ గౌడ్, సాయి, షాలు తదితరులు పాల్గొన్నారు.