మంచినీటి సమస్య కోసం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రమిచ్చిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీలో సుమారుగా 20 వేల మంది జనాభా ఉన్న గ్రామం నుంచి పట్టణంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ తాగునీటి సమస్య మెరుగుపడటం లేదు. గ్రామంలోని ప్రజలు గత మూడు సంవత్సరాల నుంచి తాగు నీరు సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే గత నెల మార్చి 14న పెనుగంచిప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి తాగునీటి పథకానికి జల జీవన్ మిషన్ ద్వారా 2.76 లక్షలు మంజూరు కాబడినవి అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినా రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి పనులు మొదలు కాలేదు.. కావున దీనికి సంబంధించిన అధికారులు త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని గ్రామ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలని ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ.. పెనుగంచిప్రోలు పంచాయతీ కార్యదర్శి నరసింహరావు కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తునికిపటి శివ వై.ఎన్.అర్ మాస్టర్ తన్నీరు గోపీనాథ్, దొడ్ల వినయ్, మనుబోలు సైదులు, ఏ గోపాలకృష్ణ, తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.