ప్రతి గ్రామానికి నీటి సరఫరా చేయాలని జనసేన వినతిపత్రం

వేసవి కాలం దృష్ట్యా ప్రతి సంవత్సరం మే నెల నుండి జూలై నెల వరకూ త్రాగునీటి సమస్య కోసం మండలంలోని ప్రతి గ్రామానికి ట్యాంకర్లతో సరఫరా జరిగేది ఈ సంవత్సరం ఇంకా మొదలు కాలేదు అంతే కాకుండా సరైన విద్యుత్తు సరఫరా లేకపోవడం వల్ల మోటార్లు వేయకపోవడం వల్ల నీళ్లు సరఫరా అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు వెంటనే స్పందించి మంచి నీళ్ల ట్యాంకర్ల ద్వారా ప్రతి గ్రామానికి నీటి సరఫరా చేయాలని మండల జనసేన పార్టీ తరపున మండల అధ్యక్షుడు జాలె౦ శ్రీనివాస్ రాజా అధ్యక్షతన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడబాల తాతకాపు, ఎంపీటీసీ కొమ్మలు జంగమయ్య, వాసంశెట్టి రమణ, చెరుకూరి సత్తిబాబు, కంకిపాటి నరసింహారావు, బొంతు చంద్రశేఖర్, తుల ఉమ, రవణం సాయి, కొమ్ముల రాము తదితరులు పాల్గొన్నారు.