బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు..!!

రాజానగరం: సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన… పలువురు వైసిపి నేతలు ఈ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా వెనక్కి నెట్టేసిన వైసిపి ప్రభుత్వ చేతకాని పాలన కు విసుగుచెంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు మరియు రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు, పార్టీని అభివృద్ధి చేస్తున్న తీరు నచ్చి… వైఎస్సార్సీపీకి చెందిన పది కుటుంబాలు బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, వీరందరికీ బలరామకృష్ణ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. సీనియర్ నేత మట్ట వెంకటేశ్వరరావు సమక్షంలో చేకూరి సత్యనారాయణ, చేకూరి నాగు, చేకూరి రామకృష్ణ, చేకూరి గణేష్ తదితర పది వైసీపీ కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు..