బొబ్బిలి పూలబాగు రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన

  • నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నాయకులు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి పూలబాగు రోడ్డు గుంతల మయమై చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు గుంతల్లో చేరి అధ్వానంగా తయారవుతుంది. దీనివల్ల ప్రజలు రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, ఉత్తరాంధ్ర రీజనల్ ఐటి కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర ఐటీ వింగ్ సభ్యులు గేదెల సతీష్ కుమార్ జనసేన నాయకులు బలగ ఆదిత్య కుమార్, జమ్మూ గణేష్, ఉల్లి సంతోష్ పైలా హరిప్రసాద్, సాయి కిరణ్, గొల్లది శ్రీను, శంకర్ ఆధ్వర్యంలో స్థానిక రాజా కాలేజ్ దగ్గర్లో (ధర్నా) జనసేన నిరసన అనేది తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా టిడిపి నాయకులు రౌతు రామ్మూర్తి నాయుడు, సాయి రమేష్, పట్నాయక్, కంచి వెంకటరమణ, కాకలా వెంకటరమణ, లోక సత్త పార్టీ నాయకులు ఆకులు దామోదర్ రావు పాల్గొనడం జరిగింది. బొబ్బిలి పూలబాగు రోడ్డు ఈ ప్రభుత్వం స్పందించి బాగు చేయక పోతే జనసేన పార్టీ పోరాటాన్ని మరింత ఉద్రితం చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఇందులో బొబ్బిలి జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.