విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

మదనపల్లె, ఒక పక్క 10వ తరగతి, ఇంటర్మీడియేట్ ఫలితాలలో గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత దారుణమైన ఫలితాలు. ఇప్పుడు ప్రభుత్వం 1.62 లక్షల ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తు అయిన ఉచిత పాఠ్య పుస్తకాల ముద్రణకు కేవలం రూ.18 కోట్లు లేక నిలిపివేశారు. ఇంటర్ విద్యామండలి దగ్గర రూ.80 కోట్లు మీ ఆర్బాటమైన ‘నాడు – నేడు’ కు ఖర్చు పెట్టి, ఇంకా వేరే అవసరాలకు రూ.100 కోట్లు మళ్లించి ఇప్పుడు పిల్లల ఉచిత పాఠ్య పుస్తకాలకు నిధులు లేక ఆపేస్తున్నారు. జూలై 1వ తేదీ నుండి క్లాసులు ప్రారంభం ఇంత వరకు ముద్రణ లేదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేస్తుందో అర్దం అవుతుంది. వెంటనే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.