మొగులూరు రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన

  • రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చాలి..
  • సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన

సర్వేపల్లి నియోజకవర్గం: పొదలకూరు మండలం, మొగులూరుకి వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్లు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలం. అయితే పొదలకూరు నుండి మొగులూరుకు వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్ల వరకు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డుపైన ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం గుంటలను కూడా పూడ్చే స్థితిలో లేదా?. మళ్లీ మూడోసారి ఎలగూ గెలవడం లేదు కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతో ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రావెల్ ఉంది, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి వాటి వరకు మింగేస్తే సరిపోద్ది అనే ఆలోచనతో ఉన్నాదా, ఇకనైనా కళ్ళు తెరిచి అస్తవ్యస్తంగా ఉన్న ఐదారు కిలోమీటర్ల రోడ్లపై ఉన్న గుంటలను పూడ్చండి సార్. మీకు ఎన్నోసార్లు నిరసనల రూపంలో తెలియజేశాం. కానీ మీకు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుంది రేపు 2024లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రాబోయేది జనసేన ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి మా ఆధినేత పవన్ కళ్యాణ్. సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి జనసేన తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజూ రాకేష్, ఖాజా, శ్రీహరి, పవన్, ప్రసాద్, వంశీ, గోపాల్, కార్తీక్, వై. పవన్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.