వారాహియాత్ర విజయవంతం చేయాలి

తుని, వారహి యాత్ర తుని నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా నియమించబడిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర తొండంగి మండలం, తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మండల జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. మండల అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ మండల జనసైనికులు అందరూ వారహి యాత్రకు సంసిద్ధం కావాలి అని పిలుపు ఇచ్చారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మండల ప్రధాన సమస్య అయిన దివిస్ ఫార్మా కంపెనీ నాడు కళ్యాణ్ పర్యటన వల్లన కొన్నాళ్ళు పనులు నిలిచి పోయాయి, తదనంతర కాలంలో మళ్ళీ దివిస్ కంపెనీ పనులు పునఃప్రారంభం అయ్యాయని సభకి విచ్చేసిన జనసైనికుల ద్వారా తెలిసింది. దాన్ని మరలా అధ్యక్షులు కళ్యాణ్ దృష్టిలో పెడతాం అని చెప్పారు. తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ వారహి యాత్రకు జనసైనికులు జన సమీకరణ చేయాలి అని యాత్రకి వచ్చే ఇతర నియోజకవర్గ జనసైనికులకు మంచి నీళ్లు మజ్జిగ వాటివి ఎవరికి తోచినవి వారు ఏర్పాటు చేయాలి అని తుని నుంచి తుది నిర్ణయం తీసుకోవాలని జనసైనికులకు పిలుపు ఇచ్చారు. ఈ సమావేశానికి మండల కార్యవర్గ సుభ్యులు, మండల, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు హాజరయ్యారు.