రోడ్ల దుస్థితి పై గుంటూరులో జనసేన నిరసన

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పార్టీ జిల్లా శ్రేణులు శుక్రవారం గుంటూరు శ్రీనగర్ మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్లపై ఉన్న గోతులు వద్ద నాయకులు ఫ్లకాట్స్ పట్టుకొని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రారని లాప్టాప్ కంప్యూటర్ తో బటన్ నొక్కటానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న రోడ్ల దుస్థితిని చూపించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అది కూడా రోడ్ల నిర్మాణం ఈనెల 15వ తేదీ పూర్తిచేసి 20 లోపు ఎగ్జిబిషన్ పెడతామని సీఎం చెప్పారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పెట్టే ఫోటోలు చూస్తారో.. మేము పెట్టే ఫోటోలు చూస్తారో తేల్చుకోవాలని సీఎం కి సూచించారు. సంక్షేమంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శులు వడ్డానం మార్కండేయ బాబు, నాయబ్ కమల్, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.