వసుమట్ల కాలనీ స్మశానానికి రహదారి ఏర్పాటు చేయాలని జనసేన నిరసన

  • దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా స్మశానానికి రహదారి ఏర్పాటు చేయక పోవడం అత్యంత దురదృష్టం: శేషుబాబు
  • గతంలో ట్రాక్టర్ లు నడిచిన రహదారి నేడు ఆక్రమణకు గురి అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కానీ, అవనిగడ్డ గ్రామ పంచాయతీ పాలకులు కానీ పట్టించుకోక పోవడం శోచనీయం: ఎంపీటీసీ భాను

అవనిగడ్డ గ్రామ శివారు వసుమట్ల కాలనీ ప్రజలు ఉపయోగించే కృష్ణా నదీ తీరాన గల స్మశానం పిచ్చి చెట్లతో, ముళ్ళ పొదలతో నిండిపోయి ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంటే పాలకులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం విడ్డూరంగా ఉందని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు మరియు జనసేన ఎంపీటీసీ బొప్పన భాను ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానానికి వెళ్ళే రహదారి ఆక్రమణకు గురి అయినదని గ్రామ సభలలో గతంలో అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా అధికారులు, పాలకులు పట్టించుకోలేదని వీరు ఆరోపించారు. అధికారులకు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చినా ఎటువంటి స్పందన లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు ఈరోజు వసుమట్ల కాలనీ నుండి పాదయాత్ర చేసుకుంటూ అవనిగడ్డ కు చేరుకుని, ఎంపిడిఓ, తహశీల్దార్, పంచాయతీ సెక్రటరీ లకు వినతిపత్రం అందించగా స్థానిక జనసేన నేతలు సంఘీభావం ప్రకటించారు. ఒక వారం రోజుల లోపు అధికారులు స్పందించి శ్మశానానికి రహదారి ఏర్పాటు చేయకపోతే గ్రామస్థులతో కలిసి పంచాయతీ కార్యాలయం ను ముట్టడిస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ కో ఆర్డినేటర్ సూదాని నంద గోపాల్, జనసేన పార్టీ టౌన్ ఉపాధ్యక్షుడు ఆళ్ళమళ్ళ చందు బాబు, మండలి నాగరాజు, మండలి రామ్ గోపాల్, వార్డు మెంబర్లు మునిపల్లి శ్రీలక్ష్మి, చేబ్రోలు ప్రతాప్, అడపా ప్రభాకర్ లు, సనకా గోపాలరావు, గుడివాక రామాంజనేయులు, బచ్చు ప్రశాంత్, బొప్పన పృథ్వీ, పసుపులేటి శ్రీను, కమ్మిలి వేణుబాబు, కమ్మిలి రఘు రత్నవరప్రసాద్, బండే నాగ మలేశ్వరి, భోగాది రాజ్యలక్ష్మి, బచ్చు కృష్ణ కుమారి, సానా లక్ష్మీ కుమారి, పప్పుశెట్టి శ్రీను, ఆకుశెట్టి రవి, యర్రంశెట్టి సుబ్బారావు, రంగనాథ్, మాదివాడ కుటుంబరావు, గ్రామస్థులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.