నారాయణమ్మనగర్ లో జనసేన జనబాట

  • పాలకుల చేతకానితనానికి, అసమర్థ పాలనకు, నిర్లక్ష్యానికి నిదర్శనం, అధికారుల అలసత్వానికి కందికుంట నారాయణమ్మనగర్ లో నెలకొని ఉన్న సమస్యలే అందుకు నిదర్శనం.

కదిరి నియోజకవర్గం: కదిరి పట్టణం 6వవార్డ్ కందికుంట నారాయణమ్మ నగర్ లో నేటికీ కాలనీలోకి వెళ్ళడానికి ఒక్క సిమెంట్ రోడ్డు లేదు, వీధి దీపాలు లేవు, కాలువలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు ఇలా కనీస వసతులు లేవని, అంతే కాకుండా మైన్స్ కోసం తూటాలు పేల్చడం వల్ల ఆ ధ్వనులు వల్ల కొత్తగా ఇంటి నిర్మాణం చేసుకుంటున్న గోడలు సైతం పగుళ్లు వస్తున్నాయని ఆ శబ్దాలకు రాళ్ళు రప్పలు ఎగిరి ఇంటిపై పడుతున్నాయని, శబ్దాలకు చిన్నపిల్లలు సైతం భయబ్రాంతులకు లోనవుతున్నారని జనసేన జనబాట కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు కాయల చలపతి లకు, పట్టణ కమిటీ సభ్యులకు, మండల కన్వీనర్లకు తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. కదిరి స్థానిక ఎమ్మెల్యే మాత్రం కదిరి పట్టణాన్ని అంతర్జాతీస్థాయిలో స్మార్ట్ టౌన్ గా తీర్చి దిద్దుతానని నాలుగు చినుకులకే కనీసం కందికుంట నారాయణమ్మ నగర్ లోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసుకొని టీ, కాఫీ, బిస్కెట్, సమోసా తిని కాలయాపన చేస్తున్నారు తప్ప కదిరి పట్టణ ప్రజల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోతున్నారని, ఎక్కడ చూసినా కుక్కల బెడద, దోమల బెడద, కాలువల్లో పేరుకుపోయిన పూడికను సకాలంలో తొలగించక పోవడం వల్ల వర్షపు నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు మునిసిపల్ కమిషనర్ గారికి వినతులు పంపించినా పట్టించుకోలేదని కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ జనసేన జనబాట కార్యక్రమంలో తిరుగుతూ ఒకే ఒక్క అవకాశం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకంతో గాజుగ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల, ప్రధాన కార్యదర్శులు కిన్నెర మహేష్, వానిల్లి అంజిబాబు, గుంతా ప్రతాప్, కార్యదర్శులు గోపీనాథ్, ఈటి లోకేష్, రాజ, సోమ శేఖర్, నాగమణి, సరస్వతి, గణేష్, మండల కన్వీనర్లు సాకే రవి కుమార్, మేకల చెరువు చౌదరి, అశ్వర్థ కుమార్, తదితర పట్టణ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.