జనసేన, బీజేపీల ఆమరణ దీక్షకు వీరమహిళా విభాగం సంఘీభావం

  • విలీన సామర్థ్యం లేని నీకు విహార యాత్రలెందుకు?
  • ఇంచార్జికి హాని జరిగితే రావణ కాష్టమే
  • జనసేన రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: వెదురుకుప్పం మండల కేంద్రంలో జనసేన బీజేపీ ఆమరణ దీక్షకు గురువారం వీరమహిళా విభాగం సంఘీభావం తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్నకు పూలమాలవేసి, దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిని మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నుద్దేశించి, వెదురు కుప్పం, కార్వేటినగరం మండలాలను కలిపే విలీన సామర్థ్యం లేని నీకు, విహారయాత్రలు ఎందుకని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిల్ల రోజా, పెద్దిరెడ్డికి చూపిన చొరవ, నువ్వు చేయలేకపోతున్నావంటే నీ అసమర్ధత, నీ స్వార్థం ప్రజలు ప్రస్ఫుటంగా గమనిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రతిదానికి జగన్ రెడ్డి కాళ్లు పట్టుకొనే ముఖ్య స్వభావం ఉన్న నువ్వు, ఈ రెండు మండలాల కోసం వెయ్యి సార్లు అయినా కాళ్లు పట్టుకోవడం మంచిదని హితవు పలికారు. రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల వనజ మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తు కంటే నీ కుటుంబ భవిత ముఖ్యమా స్వామీ నీకు అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రొంపిచర్ల, పులిచర్లకు ఉన్న ప్రాధాన్యత, వెదురుకుప్పం, కార్వేటినగరంలకు ఉన్న అప్రాధాన్యతను నారాయణస్వామి గుర్తించాలని, సద్విమర్శ చేసుకొని ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలిని డిమాండ్ చేశారు. వీరమహిళ లావణ్య మాట్లాడుతూ తిరుపతికి సమీపంలో ఉన్న వెదురుకుప్పం కార్వేటి నగరం మండలాలను యుద్ధ ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో కలపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ జనసేనకు జనం ముఖ్యం,
దేశం తర్వాతే జండా అని ఉద్ఘటించారు. ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని, వెదురుకుప్పం కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేంతవరకు వీరోచితమైన పోరాటం చేయడానికి జనసేన సిద్ధంగా ఉందని తెలిపారు. మేము మా నాయకుని అడుగుజాడల్లో నడుస్తాం, రెండు మండలాల ప్రజలకు అండగా నిలబడతాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మెడలు వంచి, తిరుపతి జిల్లాలో కలిపేంతవరకు ఈ పోరాటం ఆగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు సంఘీభావం తెలిపిన నగిరి నియోజకవర్గ నాయకులు భాను ప్రకాష్, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ ఆటో యూనియన్ నాయకులకు, సంతబైలు యువజన నాయకులు, వెదురుకుప్పం మండల కేంద్రం యువతకు, తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, గంగయ్య, జయచంద్ర, బిజెపి నాయకులు యుగంధర్ రెడ్డిలకు, కార్వేటి నగర్ మండల నాయకులు మహేష్ రెడ్డి, జితేంద్ర రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ హనుమంత్ రెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, బిజెపి జిల్లా కార్యదర్శి నల్లపురెడ్డి లక్ష్మి, తిరుపతి టౌన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మి, తిరుపతి నియోజకవర్గ వీరమహిళలు లావణ్య, దుర్గ, చందన, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, జీడి నెల్లూరు మండలం జనసేన నాయకులు రషీద్, నూర్ భాయ్, వెదురుకుప్పం మండల కార్యదర్శి కిరణ్, కార్వేటినగరం మండలం ఉపాధ్యక్షురాలు సెల్వి, వీరమహిళలు సుధ, మంజుల, జనసైనికులు పాల్గొన్నారు.