అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా జనసేన శ్రేణులు ఘన నివాళి

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా జనసేన శ్రేణులు ఘన నివాళి ఖమ్మం గోపాలపురం నందుగల ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మేడబాయిన కార్తీక్, ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గుంత సత్యనారాయణ, గుండ్ల పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఖమ్మం నగర కమిటీ సమన్వయకర్త ంద్ సాదిక్ అలీ, ప్రధాన కార్యదర్శి సూరజ్ కిరణ్, కార్యదర్శి వినోద్ కుమార్, దేవేందర్ తదితరులు పాల్గోని నివాళిలు అర్పించారు.