పదవీ విరమణ పొందిన ఆర్మీ జవానుకి జనసేన ఘనస్వాగతం

పిఠాపురం, సైతన శ్రీను మంగళవారం రాత్రి మన ఇండియా ఆర్మిలో జవాన్ గా 17 సంవత్సరాలు దేశానికి సేవ చేసి రిటైర్మెంట్ తీసుకుని కందరడా తీరిగివచ్చిన సమయంలో గౌరవప్రదంగా పిఠాపురం జనసేన నాయకులు పిల్లా వెంకట దినేష్, కందరడా ఎంపీటీసీ పిల్లా సునీత సూర్యనారాయణ వారి యొక్క కుటుంబసభ్యులు అందరూ వారిని ఇంటి వద్ద సన్మానించి ఆర్మీ వారు జవానులు, రైతులు ఇద్దరు లేనిది దేశం లేదు అని, జవానులు ప్రాణలను పణంగా పెట్టి వారి సరిహద్దుల్లో కాపలా కాస్తేనే మనం ఇక్కడ ప్రశాంతంగా ప్రజలు శాంతి భద్రతల నడుమ ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించడం సాధ్యమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లా ముత్యాలరావు, సైతన సత్యకుమారి, జనసేన పిల్లా వీరబాబు లతా, పిల్లా వీరబాబు, పి రామకుమార్, గుర్రం వేంకటేశ్వర రావు, పిల్లా వెంకన్నబాబు, కుమారి, మహేష్ మరియు కందరడా గ్రామ ప్రజలు, బంధువులు, పిల్లలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు.