పెదయాదర పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమంలో జనసేన సర్పంచ్
కృష్ణ జిల్లా, మచిలీపట్టణం, స్థానిక పెదయాదర పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదు సంవత్సరాల లోపు బాల బాలికలకు పెదయాదర సర్పంచ్ గళ్ళా తిమోతి పోలియో చుక్కలు వెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్, అంమ్ లలితా కుమారి, చిన్నయాదర వార్డ్ మెంబెర్ కొత్తపల్లి శ్రీకాంత్, గ్రామ జనసేన నాయకులు తూము బాలకోటేశ్వర రావు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-27-at-8.15.54-PM-1-1024x578.jpeg)