జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఎమ్మిగనూరు, జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, 65వ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్, సాగర్ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, లు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే ఏకైక నాయకుడు అంబేద్కర్ నేటి యువతతో పాటు రాబోయే తరం కూడా అంబేద్కర్, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, షబ్బీర్, రమేష్, రషీద్, వినయ్, గోపి, తదితరులు పాల్గొన్నారు.