గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ కు నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తాం: గుడివాడ జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్

గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పార్టీ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమసమాజ స్థాపనకు పని చేస్తానని బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్ కె, కొదమల గంగాధర్, వేమూరి త్రినాథ్, వడ్డాది లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.