14 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు జనసేన సంఘీభావం

పెడన, బ్రిటిష్ కాలం నుండి సేవలందిస్తున్న గ్రామ నౌకర్లు కాలక్రమేణా గ్రామ సహాయకుల పని చేస్తున్నారు. వీఆర్ఏలకు ఉద్యోగ శైలి మిగతా ఉద్యోగుల కన్నా భిన్నంగా ఉంటుంది. పని ఎక్కువ, జీతం తక్కువ. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికి అయినా నా ముందు ఉండేది విఆర్ఎ నె. ఎమ్మార్వో నుండి రాష్ట్రపతి వరకు ఏ అధికారి వచ్చినా సాదర స్వాగతం పలికేది కూడా విఆర్ఎ లె. నెలకు కేవలం పదివేల ఐదు వందల రూపాయల జీతంతో సేవలు అందిస్తున్న విఆర్ఎ ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కుటుంబ అవసరాలకు అప్పులు చేస్తున్న పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. పదవిలో వచ్చాక అన్ని మరిచారు.

వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు

  • 21,000 కనీస వేతనం ఇవ్వాలి.
  • వేతనంతో కూడిన డిఏ ఇవ్వాలి.
  • నామినిగా పని చేస్తున్న వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
  • 11వ పిఆర్సి తొ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా విఆర్ఎలకు పిఆర్సి వర్తింపచేయాలి.
  • నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.
  • విఆర్ఏ లుగా పనిచేస్తూ 65
    సంవత్సరాల పైబడి చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగం ఇవ్వాలి.

14 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న వీఆర్ఏలకు పెడన మండల ఆఫీస్ దగ్గర సోమవారం జనసేన పార్టీ సంఘీభావం తెలియచేసింది. వీఆర్ఏల న్యాయమైన కోర్కెలను వెంటనే నెరవేర్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. పక్షాలు ఉద్యోగ సంఘాలతో కలిసి ఎలాంటి పోరాటానికైనా జనసేన సిద్ధంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట, కోట నాగరాజు, పుల్లేటి దుర్గారావు, నవీన్ కృష్ణ, బత్తిన చందు నరేష్, దాసరి రవీంద్ర, మోటెపల్లి సురేష్, జనసేన బంటుమిల్లి మండల అధ్యక్షుడు ర్యాలీ సత్యనారాయణ, పాశం నాగమల్లేశ్వరరావు, శివమణి, అమ్మిశెట్టి సురేష్, సోమరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.