పాడేరులో జనసేన ఆత్మీయ సమావేశం

పాడేరు, జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ యొక్క ప్రజాస్పందన పై అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరకు, పాడేరు నియోజకవర్గ పరిధిలో గల పలు మండల జనసైనికులు ముఖ్య నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అధ్యక్షత వహించిన డా.వంపురు గంగులయ్య ప్రతి జనసైనికుని యొక్క అభిప్రాయం, సూచన, స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఇప్పటికి అపరిష్కృతంగా ఉన్నటువంటి పలు సమస్యలపై స్పందిస్తూ పంచాయితీ నిధులు దారి మల్లిస్తూ అసలే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరి గ్రామాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇంకా తాగునీటి సమస్యలు గిరిజన గ్రామాల్లో కోకొల్లలుగా ఉన్నది. వాటిని పరిష్కరించే నదులు కరువయ్యారని, రుడకోట గ్రామంలో ఆగని శిశు మరణాలు ఆదివాసీ హృదయ్యాలో వేదన కలిగిస్తోందని ప్రజారోగ్యవ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మారుమూల పల్లెల్లో పంటశేఖరణ జరగకుండా ఎటువంటి నష్ట పరిహారం చెయ్యకుండా రోడ్లు వేస్తున్నారని అయితే రోడ్లకు మేము వ్యతిరేఖం కాదని నష్టపరిహారం జరిగితే చాలని, ఐ.టి.డి.ఏ తరలింపు, గ్రామాల్లో డ్రైనేజి సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఆశ వర్కర్స్ సమస్యలు, నాడు-నేడు కార్యక్రమములో తొలగించిన పాఠశాల విద్యావ్యవస్థలో లోపాలు, గిరిజన గూడెల్లో అక్రమ మైనింగ్, జీవో నెం 3 అంశాలు, జిల్లా కేంద్రాలు ఏర్పాటువలన లాభ నష్టాలు, రైతులకు కంటితుడుపు చర్యగా గిట్టుబాటు ధరలు, ఉద్యోగుల సిపిఎస్ అంశాలపై డా.గంగులయ్య సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇటీవలే మార్చి 14వ తేదీన జరిగిన జనసేన ఆవిర్భావ సభ ప్రస్తుత పాలకవర్గాల్లో గుబులు పుట్టిస్తోంది ప్రహ వ్యతిరేకత మొదలయ్యిందని చివరికి ఎస్టి, ఎస్సి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిందని ఈ ప్రాంత గిరిజన ప్రజా ప్రతినిధులు నోరుమెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. రానున్నది పవన్ అన్న ప్రభుత్వమని, ప్రజలు ఈ విషయం గుర్తించాలని ప్రజలకు స్వేచ్ఛగా పాలించే నాయకుడు కావాలో హింసించే నాయకుడు కావాలో తేల్చుకోవలని హితవు పలికారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం స్వచ్ఛందంగా జనసైనికులు లక్షలాదిగా తరలి వచ్చారు. అదే ప్రతిపక్ష, పాలక ప్రభుత్వ వర్గాలు ఈ పాటి సభ జరపలంటే సుమారు 100 కోట్లు ఖర్చు చేయాల్సిందేనని ఇది జగమెరిన సత్యమని వ్యూహాత్మక రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ ప్రారంభించారని తట్టుకోవడం పాలకవర్గానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ సమావేశంలో చింతపల్లి ముఖ్య నాయకులు బుజ్జిబాబు, స్వామి, రవి, శీను, అలాగే జనసైనికులు, జీ. మాడుగుల నాయకులు, అధ్యక్షులు ఎం. భీమన్న, మస్తాన్, రమేష్, పవన్, గంగప్రసాద్, వెంకటరమణ, తదితర జనసైనికులు, పాడేరు మండల నాయకులు కిటలంగి పద్మ, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, సత్యనారాయణ, రమేష్ నాయుడు, కొండ బాబు, కె.అశోక్, సంతోష్, జె.ఈశ్వరరావు, ఎస్.బాబూరావు, బాలరాజు, తదితర 50 మంది జనసైనికులు పాల్గొన్నారు.