ఆటో టాక్సీ, మాక్సి క్యాబ్, జీపు డ్రైవర్లకు అండగా జనసేన

తిరుపతి, ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో జీపు డ్రైవర్లు పోషిస్తున్న పాత్ర ఎంతో ఉన్నతమైందన్నారు జీపు డ్రైవర్లకు జనసేన అండగా ఉంటుందన్నారు. శుక్రవారం జీపు డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు కార్మికులు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్బంగా అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ డ్రైవర్ యూనియన్లు సోదరులందరికి ఇన్సూరెన్సు చేయించి మీకు జనసేన అండగా ఉంటుంది అని తెలియచేసారు. మీ సమస్యలు ఏవి ఉన్న మన పార్టీ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తాం అని తెలియచేసారు. జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జీపు డ్రైవర్ల సమస్యలు అన్నిటిని జనసేన రాగానే మీకు అండగా ఉంటాము, తిరుపతిలో జీపు డ్రైవర్లు సంఘటితంగా ఉంటూ వచ్చే యాత్రికులకు తమ స్థాయిలో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. త్వరలోనే అధికారంలోకి రాబోతున్నామని, జీపు డ్రైవర్ల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో జీపు డ్రైవర్లను తిరుమల కొండకు అనుమతించని సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే చిరంజీవి అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో టాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్ల పాత్ర ఎంత గొప్పదో విరవరించి వారికి జనసేన అండగా ఉంటుంది అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి ఆనంద్, జనసేన నాయకులు ఆర్కట్ కృష్ణప్రసాద్, యూనియన్ నాయకులు హరి నాయక్, బాల నాయుడు, భద్ర, జనార్దన్ లోక యాదవ్, వెంకటరెడ్డి, వెంకటేష్, దేవేంద్ర, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.