భానుకి అండగా జనసేన

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం చంద్రయ్య గారి పల్లెలో గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల భాను అనే యువతకి పలుదపాలుగా జనసేన పార్టీ నాయకులు ఆర్ధిక సహాయం అందించిన సంగతి విధితమే. శనివారం మరికొంత మేర 5000 రూపాయల సహాయాన్ని బాధితురాలు తల్లి శ్రీమతి భారతికి జనసేన పార్టీ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి తులసి బాబు, యువ నాయకులు మైలారి వినయ్, చందు, వెంకటేష్, ప్రవీణ్, ఆకాష్, ప్రదీప్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. తన కూతురి ఆరోగ్యం కోసం అనేక పర్యాయాలు ఆర్థిక సహాయం చేసి, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న జనసేన పార్టీ నాయకులకు, వారిని నడిపిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాధితురాలు తల్లి ధన్యవాదాలు తెలియజేశారు.