చేనేత కళాకారుడికి కుటుంబానికి అండగా జనసేన

  • ఆంధ్ర రాష్ట్రంలో దారుణమైన స్థితిలోఉన్న చేనేత కళాకారుల పరిస్థితి

మంగళగిరి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు రత్నాల చెరువు జనసైనికుల సౌజన్యంతో మంగళగిరి, రత్నాల చెరువు 6వ లైన్ లో నివసిస్తున్న చేనేత కళాకారుడు వల్లెం వీరవెంకట సత్యనారాయణ, సత్యవతి దంపతులకు జీవనోపాధి కోసం తోపుడు బండి(ట్రాలీ రిక్షా)ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రత్నాల చెరువు చెందిన చేనేత కళాకారుడు సత్యనారాయణ గారికి జీవనోపాధి కోసం తోపుడు బండిని ఈరోజు జనసేన కార్యాలయంలో అందించడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్రంలో చేనేత కళాకారుల పరిస్థితి ఎలా ఉందంటే అనారోగ్యం వస్తే సరైన ఆరోగ్య బీమా లేదు, సరైన పింఛన్, అలాగే ప్రమాదాస్తు చేనేత కార్మికులు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే భరోసా కూడా రావట్లేదు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులను ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు. కార్మికులకు అందించే పథకాలు వారికి అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవట్లేదని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చేనేత కళాకారులకి ఆరోగ్య భీమా, సరైన పింఛన్, పని చేయలేని స్థితిలో జీవనోపాధి కోసం ఆసరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. చేనేత కళాకారులకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడు ఉంటారని తెలియజేశారు. తదనంతరం సత్యనారాయణ చిల్లపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడుతూ నా పరిస్థితి మీ దృష్టికి వచ్చిన వెంటనే నా జీవనోపాధి కోసం సాయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉందని, నాకు సాయం చేసిన వారందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రామ, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నారాయణ, బడే సాంబశివరావు, ఎంటిఎంసీకార్యదర్శి కామేష్, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చల్లపల్లి యూత్ సభ్యులు మేకల చంద్రశేఖర్, రత్నాల చెరువు జనసైనికులు సీతారాం, శివ, దుర్గారావు, దుర్గాప్రసాద్, గోపి, ప్రసాద్, పవన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.