వికలాంగుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా మడకశిర జనసేన

శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గంలో పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు సదరం సర్టిఫికెట్ కోసం వికలాంగులు అనేక ఇతర దూరప్రాంతాల నుంచి వచ్చి అనేక తీవ్రమైన ఇబ్బందుల పడుతున్నా.. పట్టించుకోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య వైఖరితో సతమతమవుతూ… ఉరవకొండ, కళ్యాణదుర్గం, కంబదూరు, బత్తలపల్లి, తాడిపత్రి అనేక ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి మండల జనసేన అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు పార్టీ కార్యకర్తలు మండల నాయకులు అందరూ ఈ వికలాంగులకు మద్దతు తెలిపి జనసేన పరంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఏ పార్టీ వ్యక్తులైనా రాజకీయాలు చెయ్యాలి కానీసమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయకూడదు వికలాంగుల సమస్యలను పరిష్కారం చేయాలని.. లేనిపక్షంలో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారడానికి ఒక నిదర్శనంగా ఈరోజు చిన్నారి, ఒక వ్యక్తిమృతి అకాల మరణం నిదర్శనం. ఆ విషయానికి ఎంతో చింతిస్తూ అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి.. వికలాంగులకు సర్టిఫికేట్లు అందజేసి.. బాధితులకు న్యాయం చేయాలని.. ఈ సమస్య తీరని పక్షంలో.. కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కానీ సీఎం కార్యాలయ ముట్టడి చేసి.. ధర్నా కార్యక్రమం చేపట్టడం.. సమస్యలు పరిష్కరించే విధంగా జనసేన పార్టీ కార్యాచరణ చేపడతాం అని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తూ.. వికలాంగులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు టి.ఏ శివాజీ, మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.