వీరమహిళ కుటుంబానికి అండగా జనసేన

  • జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

అనంతపురం: జనసేన పార్టీ వీర మహిళ దార్భి భర్త పీర అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత అనంతపురం నగరంలోని స్థానిక రామిరెడ్డి కాలనీలోని వారి స్వగృహానికి వెళ్లి, పీరా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జనసేన పార్టీ తరపున వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసి మూడునెలలకు సరిపడా మందులను అందజేశారు.