బాధితురాలికి అండగా నిలిచిన జనసేన

  • భూమి ఆక్రమణకు యత్నం విషయంలో బాధితురాలికి న్యాయం దిశగా నర్సంపేట పోలీసు అధికారుల నిర్ణయం హర్షనీయం
  • కృతజ్ఞతలు తెలిపిన జనసేన పార్టీ నాయకులు శివ కోటి యాదవ్

నర్సంపేట మండలం, రాజుపేట గ్రామం, పాకాల్ రోడ్డులో తనకి ఉన్నటువంటి 0.06 గుంటల భూమి యందు కోళ్లదానా కొరకు రేకుల షెడ్డు ఇళ్లు నిర్మాణం చేపట్టగా అధికార పార్టీకి చెందిన ఒక నేత దీనిని అడ్డుకుంటూ ఒక సదరు వ్యక్తిని ముందు పెట్టి అతడు తనకి ఆ భూమి అమ్మాడని, అలాగే నా భూమిని తన భూమిగా చెప్పుకుంటూ రాళ్లు పాతాడని, దీనికి బాధితురాలు కవిత 15-11-2022 న నర్సంపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనికి పోలీసు వారు ఆ అధికార పార్టీ నేతను మరియు అతని అనుచరుడిని పిలిపించి వారి దస్తావేజులు తెమ్మనగా వారు తేకుండా, పోలీస్ స్టేషన్ కి రాకుండా వాయిదాలు వేస్తూ ఉండడంతో బాధితురాలు కవిత తనకి న్యాయం చేసే విధంగా అండగా ఉండాలని ఈనెల మార్చి 2 వ తేదీన జనసేన నాయకులు మేరుగు శివకోటి యాదవ్ ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై స్పందించిన శివకోటి యాదవ్ కవిత భూమికి సంబంధించిన ఆధారిత పత్రాలను పరిశీలించి, ఈ యొక్క భూమి కేసు పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతున్నందున పోలీసు అధికారులపై ఉన్న గౌరవం, నమ్మకంతో ఈ కేసుకి సంబంధించి పోలీసు వారు అంతిమ నిర్ణయం, చర్యలు తీసుకునే వరకు కొద్ది రోజులు వేచి చూద్దామని, కవితకి అండగా ఉంటానని తెలుపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల నర్సంపేట ఏసిపి ఏ.సంపత్ రావు, సిఐ పులి.రమేష్ సమక్షంలో ఇరుపక్షాలను పిలిపించి వారి పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరి భూమి దస్తావేజు ఆధారిత పత్రాలను,పూర్వం మరియు ప్రస్తుతం ప్రభుత్వం రికార్డులో ఉన్న సర్వే, ఇంటి నెంబర్లను పరిశీలించి ప్రస్తుతం ఆ భూమి యందు బాధితురాలు కవితకే హక్కు ఉంటుందని, తనకే చెందుతుందని, ఆ అధికార పార్టీ నేత సదరు వ్యక్తి కవిత భూమి మీదకి వెళ్లి మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, ఏదైనా ఉంటే వాళ్ళని కోర్టు ద్వారా లీగల్ గా వెళ్లమని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయంపై స్పందిస్తూ బాధితురాలు కవిత తరుపున పెద్ద మనిషిగా వెళ్లిన జన సేన పార్టీ నాయకులు మేరుగు శివ కోటి యాదవ్ కవితకి న్యాయం దిశగా పోలీసు అధికారుల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ వారికి జన సేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బాధితురాలు కవిత పోలీసువారు తనకి న్యాయం చేయడం వల్లనే ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా తన భూమి యందు నూతన రేకుల షెడ్డు ఇంటిని నిర్మించుకున్నానని, తనకి న్యాయం చేసిన పోలీసు అధికారులు ఏసిపి ఏ.సంపత్ రావు, సిఐ పులి.రమేష్ మరియు తనకి అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు శివ కోటి యాదవ్ లకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.