మహా పాదయాత్రకు జనసేన మద్దతు

విశాఖ ఉక్కు నిర్వాసితులు ఎంప్లాయిస్ పోరాట కమిటీ తలపెట్టిన 64 గ్రామాల నుండి సింహాచలం వరకు మహా పాదయాత్రకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున 64 వార్డ్ కార్పొరేటర్, జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాలని చెప్పటం జరిగింది. ఈ పాదయాత్రలో మాక శాలని, విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ గా లేబర్ యూనియన్, ప్రజా సంఘాలు, ఎంప్లాయిస్ యూనియన్, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.