అమరావతి రైతులకు తిరుపతి పట్టణము నందు రెండవ రోజు మద్దతు తెలిపిన జనసేన

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు

అమరావతి రైతులకు మద్దతుగా తిరుపతి పట్టణమునందు రెండవ రోజు పాదయాత్రలో పాల్గొని వారికి పూర్తి మద్దతు తెలియజేసిన జనసేన.

అమరావతి నుంచి పాదయాత్రగా తిరుపతి సోమవారం సాయంత్రం చేరుకొని మంగళవారం ఉదయం తిరిగి పాదయాత్ర కొనసాగించిన అమరావతి రైతులకు ఘనస్వాగతం తెలియజేసి మద్దతు తెలియజేసిన చిత్తూరు జిల్లా జనసేన పార్టీ.

ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలుపుతూ వారితో కలిసి అలిపిరి శ్రీవారి పాదాల చెంత వరకు పాదయాత్రలో మమేకమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రైతులకు స్వాగతం తెలుపుతూ లక్ష్మీపురం సర్కిల్ వద్ద కొందరు ఒక విచిత్రమైన ఫ్లెక్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో “మీతో మాకు గొడవలు వొద్దు మీకు స్వాగతం, మాకు మూడు రాజధానులు కావాలి అని కింద తిరుపతి ప్రజలు అని ఉంది, మీకు ఎలా ఈ ప్లెక్సీలు కట్టడానికి తిరుపతి పట్టణం లో కమిషనర్ పర్మిషన్ ఇచ్చారు, మా జనసేన పార్టీ ఫ్లెక్సీలు కడితే ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి పర్మిషన్ లేదని తీసేస్తారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పేర్లు వేసి ఈ ఫ్లెక్సీ కట్టి ఉంటే బావుండేది అంతేగాని దొంగచాటుగా దొంగ పనులు, ఈ రాష్ట్ర అంతట అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారు అలాగే తిరుపతి పట్టణ ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు, మీరు ఎవరు తిరుపతి ప్రజలు మూడు రాజధానులు కావాలని చెప్పడానికి అని ఆగ్రహించారు.

తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ వేలాదిగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్న రైతులను ఇలాంటి ఫ్లెక్సీలు కట్టి అవమానించడం అని అదేవిధంగా వైసిపి నాయకులకు భయం మొదలైంది తిరుపతి ప్రజలందరూ మూడు రాజధానులు మద్దతుగా తెలియజేస్తున్నారు రేపు రాబోయేది నూటికి నూరు శాతం జనసేన ప్రభుత్వామే అని స్పష్టం చేశారు.

జనసేన నేతలు మాట్లాడుతూ తమ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడ పాల్గొన్నారు, అమరావతి ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని రైతుల కోర్కెలు నెరవేర్చాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కోర్కెలు కోరామని తెలియజేశారు.