పెనుకొండలో టిడిపి నిరసన దీక్షకు జనసేన మద్దతు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా సోమవారం పెనుకొండలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల అధ్యక్షులు మహేష్, సీనియర్ నాయకులు రాజేష్, రామంజి, నరసింహమూర్తి, యువ నాయకులు, మల్లేష్, హరి నాయక్, వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.