పోలవరంలో టీడీపీ రిలే నిరాహారదీక్షకు జనసేన మద్దతు

పోలవరం నియోజకవర్గం: కొయ్యలగూడెం టౌన్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి మంగళవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పోలవరం నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు, ఏడు మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని మద్దతు తెలిపారు. జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ రాక్షస పాలన అంతం చేయడం కోసం పోరాడాలని, భవిష్యత్తు కార్యాచరణను ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. మద్దతు తెలిపిన జనసేన నాయకులకు కార్యకర్తలకు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.