Hyderabad: ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

గతంలో ఏసి పని చేస్తూ మహేంద్ర అపార్ట్మెంట్ లో 12వ అంతస్తు నుండి కింద పడి బాలాజీ అనే యువకుడు మరణించడం జరిగింది. బాలాజీ తండ్రి పోలియోతో బాధపడుతున్నారు. అంతే కాకుండా బాలాజీ ఒక్కడే కొడుకు కావటంతో వారికి జీవన ఆధారం కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి మేమున్నాము అని ఒక భరోసా కల్పించి జంట నగరాలలో ఉన్న ఏసి వర్క్స్ అనే వాట్సాప్ గ్రూప్ లో జరిగిన సంఘటనని 115వ డివిజన్ బాలాజీ నగర్ జనసేన ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్ పంపించగా అందరూ తమవంతు సహాయ సహకారాలు అందించగా వచిచిన మొత్తాన్ని బుధవారం దుర్గా శ్రీనివాస్, నరేష్, ప్రసాద్, రమేష్ మరియు చందు కలిసి బాలాజీ తండ్రికి అందచేయటం జరిగింది. అంతే కాకుండా బాలాజీ కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్నా ముందుకు వచ్చి సహాయం చేస్తాము అని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాలాజీ కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించిన వారికి బాలాజీ తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.