రాజమహేంద్రవరంలో జనసేన, టిడిపి, బిజేపిల ఇంటింట ప్రచారం

రాజమండ్రి: జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బిజేపి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం స్థానిక పదో వార్డులో జనసేన పార్టీ అధ్యక్షులుశ్రీ వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుని ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పదవ వార్డులో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైశ్యులు గారితో పాటు జనసేన జిల్లా నాయకులు జామి సత్యనారాయణ నగరఉపాధ్యక్షులు దాసరి గురునాధ రావు తెలుగుదేశం పదవ ఇంచార్జ్ చొప్పెల్ల వీరభద్ర రావు, ఆసూరి సుధాకర్ రావు, షేక్ ఖాన్, షేక్ బాషా, కప్పల ప్రకాష్ మరియు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు, వీరమహిళలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.