తిరువూరులో జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశం

తిరువూరు నియోజకవర్గం: తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం గురువారం సాయంత్రం తిరువూరులో జరిగింది.. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్, జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియా శెట్టి శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా బత్తిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలను అనుసరించి వైసీపీ దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే రెండు పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఇరు పార్టీల ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి మేనిఫెస్టో, విధి విధానాలుగురించిచర్చించడం జరిగింది. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో ఉమ్మడిగా పోరాడాలని, త్వరలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఓటర్ లిస్టు మీద, దొంగ ఓట్ల మీద దృష్టి పెట్టాలని చర్చించడం జరిగింది. మండల, గ్రామస్థాయిలో త్వరలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, త్వరలో రానున్న ఉమ్మడి మేనిఫెస్టో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు మండల కార్యవర్గ సభ్యులు, టౌన్ అధ్యక్షులు నాయకులు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు.